కాశీబుగ్గలో మూడు నెలలుగా డీఎస్పీ లేరు
SKLM: కాశీబుగ్గ సబ్ డివిజన్ కార్యాలయంలో సుమారు మూడు నెలలుగా డీఎస్పీ లేకుండా... కేవలం ఇంఛార్జ్ అధికారితో పాలన కొనసాగిస్తున్నారు. టెక్కలి డీఎస్పీ ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఆయన అక్కడ నుంచే పరిపాలన కొనసాగిస్తున్నారు. గతంలో డీఎస్పీ బదిలీ అయిన ఒక్క రోజులోనే మరో డీఎస్పీని ఇక్కడ నియమించేవారు.