'వడదెబ్బ తగలకుండా జాగ్రత్త పడాలి'
SRCL: ఎండాకాలం సెలవులలో విద్యార్థులు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పడాలని సిరిసిల్ల జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి కవిత అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లిలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పిల్లల దత్తత, రక్షణ చట్టాలు, అంతర్జాతీయ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా అవగాహన కార్యక్రమంలో నిర్వహించారు.