అర్ధరాత్రి ఏటీఎంలో చోరీ

అర్ధరాత్రి ఏటీఎంలో చోరీ

SRD: జిన్నారం మండలం గడ్డపోతారంలో ఉన్న ఏటీఎంలో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. గడ్డపోతారంలోని పోచమ్మ ఆలయం సమీపంలో గల కొటక్‌ మహీంద్ర బ్యాంకు ఏటీఎంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. శనివారం ఉదయం అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఏటీఎంను పరిశీలిస్తున్నారు.