ట్రావెల్ బస్సు బోల్తా.. ఆరుగురికి గాయాలు
నెల్లూరు: మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటన పెళ్లకూరు మండలం, దొడ్లవారిమిట్ట జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సులో 21 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.