'సచివాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎంపీడీవో'

PPM: జియ్యమ్మవలస మండలం తుంబలి గ్రామ సచివాలయాన్ని ఎంపీడీవో ఎస్ రమేష్ మంగళవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రజలకు అందించే సర్వీసులు గురించి సచివాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ ఎస్టీ నుంచి ఇద్దరు మహిళలు గొర్రెల పెంపకం గూర్చి దరఖాస్తు చేయగా సంబంధిత అధికారులకు ప్రతిపాదనలు పంపించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం అంగన్వాడి సెంటర్ సందర్శించారు.