ఘనంగా హిందూ సమ్మేళన యాత్ర
SRCL: బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో నిర్వహించిన హిందూ సమ్మేళన యాత్ర కాషాయ జెండాలతో ఘనంగా నిర్వహించారు. మండలంలోని విలాసాగర్, దేశాయిపల్లి, మర్లపేట, రామన్నపేట, రత్నంపేట, జగ్గారావుపల్లి గ్రామాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ త్రిలింగ సంగమేశ్వర స్వామితో పాటు సీతారాములను భక్తులు దర్శించుకుని పూజ నిర్వహించారు.