పారదర్శక సేవలకు స్మార్ట్ ఫోన్లే మార్గం: ఎమ్మెల్యే
W.G: నరసాపురం జనసేన కార్యాలయంలో ఇవాళ ప్రభుత్వం తరఫున డ్వాక్రా వీఓఏలకు ఉచిత సెల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి MLA బొమ్మిడి నాయకర్, నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ రామరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అర్హులైన మహిళలకు స్మార్ట్ ఫోన్లను అందజేస్తూ.. ఈ సాంకేతికత ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత వేగంగా చేరుతాయని వారు పేర్కొన్నారు.