విలువైన ప్రభుత్వ భూమి స్వాధీనం

KMM: రికార్డులు తారుమారు చేసిన రూ.50 కోట్ల విలువైన భూమిని ప్రభుత్వాధికారులు తిరిగి స్వాధీన పరుచుకున్నారు. ఖమ్మం అర్బన్ మండలంలోని మల్లెమడుగు రెవెన్యూ పరిధిలోని 196/2, 196/1 సర్వే నంబరులోని 9 ఎకరాల 9 గుంటల భూమి ఆక్రమణకు గురి కాగా, గురువారం స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు.