'కొబ్బరి పీచుతో చేసిన వస్తువులతో కాలుష్య రహితం'

కోనసీమ: కొబ్బరి పీచుతో తయారు చేసిన వస్తువులు చాలా బాగున్నాయని రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు రొంగల గోపి అన్నారు. అమలాపురంలో ఏర్పాటు చేసిన స్టాల్‌ను అయినవిల్లి బీజేపీ అధ్యక్షులు యనమదల వెంకటరమణతో కలిసి ఆయన వస్తువులను పరిశీలించారు. వీటి వల్ల వాతావరణ కాలుష్యం ఉండదని, ఇవి ప్లాస్టిక్ రహితంగా తయారు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.