'వికలాంగులకు ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయాలి'
ADB: వికలాంగుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం బాధాకరమని NPRD జిల్లా ఉపాధ్యక్షుడు ఆశన్న, జిల్లా కార్యదర్శి అరిఫాబేగం అన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పట్టణంలోని జిల్లా కలెక్టరేట్ ఎదుట కేంద్ర బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. వికలాంగులకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.