పెద్ద ఎత్తున బెల్లం ఊట ధ్వంసం

బాపట్ల: చీరాల నియోజకవర్గ పరిధిలో శనివారం ఒంగోలు ఎక్సైజ్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. చీరాల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదినారాయణపురం రాంనగర్లో నాటు సారాకు ఉపయోగించే బెల్లం ఉటను పోలీసులు గుర్తించారు. భూమిలో నిల్వ ఉంచిన 650 లీటర్ల బెల్లం ఉటను నాశనం చేశారు. ఈ సెర్చ్‌లో ఒంగోలు ఎక్స్చేంజ్ అధికారులు చీరాల సీఐ నాగేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు.