'పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి'
MLG: ఏటూరునాగారం మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం గ్యాస్ సిలిండర్ ధర రూ.60 పెంచిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ CPM పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. CPM నేత రవికుమార్ మాట్లాడుతూ.. సామాన్యులపై భారాలు మోపడం సరికాదని, చమురు కొరత సాకుతో ధరలు పెంచడం ప్రజలను మోసం చేయడమేనని మండిపడ్డారు. పెంచిన ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.