విదేశీ పర్యాటకులకు థాయ్‌లాండ్ బంపర్ ఆఫర్

విదేశీ పర్యాటకులకు థాయ్‌లాండ్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ దేశంలో ప్రయాణించే పర్యాటకులకు దేశీయ విమాన ప్రయాణాన్ని ఫ్రీ అందించనున్నట్లు వెల్లడించింది. ఫుకెట్, బ్యాంకాక్ వంటి ప్రదేశాలకు మాత్రమే విదేశీ పర్యాటకులు వెళ్తున్నారని చెప్పింది. తమ దేశంలోని ఇతర ఎక్కువ పర్యాటక ప్రదేశాలను వారు ఆదరించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.