'నీటి సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరం'
E.G: పెరవలిలో సోమవారం జరిగిన 'జలధార' కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేశ్ మాట్లాడుతూ.. ప్రతి గ్రామానికి నీటి భద్రత ప్రణాళిక, ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందించాలని ఆదేశించారు. అన్ని శాఖల సమన్వయంతో ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలని, ఇందులో సాగునీటి సంఘాలు కీలక పాత్ర పోషించాలని కోరారు. నీటి సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు.