చికిత్స పొందుతూ వివాహిత మృతి

చికిత్స పొందుతూ వివాహిత మృతి

MHBD: నెల్లికుదురు మండలం బంజార తండాకు చెందిన భానోత్ హుస్సేన్- అరుణ(26) అనే దంపతుల మధ్య గొడవ తలెత్తింది. ఈ నేపథ్యంలోనే మనస్థాపంతో అరుణ ఈనెల 5న పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ.. ఆదివారం మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేష్ బాబు తెలిపారు.