అకాల వర్షం అన్నదాతకు తీరని నష్టం

అకాల వర్షం అన్నదాతకు తీరని నష్టం

PDPL: ముత్తారం మండలంలో కురిసిన అకాల వర్షం అన్నదాతకు తీరని నష్టాన్ని మిగిల్చింది. గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం వర్షం ధాటికి తడిసి ముద్దయింది. కొందరు రైతుల ధాన్యం వరద నీటిలో కొట్టుకపోవడంతో అన్నదాత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. వరికోతలు పూర్తికాని పొలాల్లో పంట నేలవాలింది. అకాల వర్షంతో నష్టపోయిన తమను ఆదుకోవాలని అన్నారు.