సింగరేణి ఆధ్వర్యంలో 3 నెలల ఉచిత శిక్షణ తరగతులు
MNCL: మందమర్రి సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో మహిళలకు 3 నెలల ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. టైలరింగ్, బ్యూటీషియన్, మగ్గం వర్క్, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. సింగరేణి ఉద్యోగుల, మాజీ ఉద్యోగుల భార్యలు చుట్టుపక్కల గ్రామాల మహిళలు డిసెంబర్ 9-15 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.