ఆర్టీటీ సంస్థ కొనసాగించాలని కోరుతూ నిరసన

ATP: ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ సేవలను కేంద్ర ప్రభుత్వం కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం గుత్తి మండలంలోని ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పూలే విగ్రహం వద్ద ఆర్డీటీని కాపాడుకుందాం-అనంతను రక్షించుకుందాం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ఆర్డీటీ సేవల వల్ల ఎంతో మంది పేద విద్యార్థులు బాగుపడ్డారని అన్నారు.