కలుషిత నీరు.. అస్వస్థతకు గురవుతున్న చిన్నారులు

కలుషిత నీరు.. అస్వస్థతకు గురవుతున్న చిన్నారులు

HYD: మల్లేపల్లి ప్రాంతంలో గత కొన్ని రోజులుగా కలుషిత నీరు సరఫరా అవుతుంది. దీంతో ఇళ్లకు వస్తున్న తాగునీరు పసుపు రంగులో, దుర్వాసనతో కూడి ఉండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నీటిని తాగి పలువురు చిన్నారులు డీహైడ్రేషన్‌కు గురవుతున్నట్లు సమాచారం. అధికారులకు విన్నవించినా ఫలితం లేదని బాధితులు మండిపడుతున్నారు.