ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలకు జ్యోతి

ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలకు జ్యోతి

విశాఖ: నగరానికి చెందిన అథ్లెట్ జ్యోతి యర్రాజీ 11వ ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ -2024 పోటీల్లో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు. ఈ రోజు, రేపు ఇరాన్‌లో జరిగే ఈ పోటీల్లో మన దేశం నుంచి జ్యోతితో పాటు మరో 15 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. జ్యోతి 60 మీటర్ల హార్టిల్స్, 60 మీటర్ల ప్లాట్ ఈవెంట్లకు ఎంపికయ్యారు.