సింగర్ మంగ్లీపై కేసు నమోదు
HYD: సింగర్ మంగ్లీపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మైక్రో ఫైనాన్స్ పేరిట రూ. 10 కోట్ల మేర మోసం చేసినట్లు మంగ్లీ, ఆమె సోదరుడితో పాటు మరో ముగ్గురిపై న్యాయవాది సుబ్బారావు ఫిర్యాదు చేశాడు. తనకు వారి నుంచి ప్రాణహాని ఉందని న్యాయవాది ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు బీఎన్‌ఎస్ సెక్షన్ 351(2), 352 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.