'భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

SRCL: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. 24/7 డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) టీమ్ అందుబాటులో ఉంటుందని, విపత్కర సమయాల్లో సహాయం కోసం డయలత్ 100కి లేదా సమీప పోలీసులకు సమాచారం అందిస్తే తక్షణ సహాయక చర్యలు చేపడతామని తెలిపారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తమైందని ఆయన పేర్కొన్నారు.