కళామహోత్సవ వేడుకకు అనూహ్య స్పందన

కళామహోత్సవ వేడుకకు అనూహ్య స్పందన

HYD: భారతీయ కళా మహోత్సవ్ పేరిట బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహిస్తున్న వేడుకలకు నగర వాసుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. కళామహోత్సవాన్ని సందర్శించడంతో పాటు అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌లో దాదాపు రూ. 2కోట్ల విలువైన వస్తువులను కొనుగోలు చేశారు. ఈ ఉత్సవం రేపటితో ముగియనుంది.