స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు

SRD: జిల్లాలో ఈనెల 22 నుంచి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు జరుగుతాయని డీఈవో వెంకటేశ్వర్లు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. 22, 23 తేదీల్లో ప్రాథమిక పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు 50% చొప్పున హాజరుకావాలని పేర్కొన్నారు. 29న ఉన్నత పాఠశాలలో పనిచేసే లాంగ్వేజ్, 30న నాన్ లాంగ్వేజ్ ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు.