ఆటో డ్రైవర్ నిజాయితీ.. రూ.5 లక్షల బంగారు నెక్లెస్ అప్పగింత!
KDP: సిద్దవటం మండలం వంతాటిపల్లి గ్రామానికి చెందిన విజయకుమారి కడపలో షాపింగ్ చేసి తిరిగి వెళ్తూ ఆటోలో రూ.5 లక్షల విలువైన 35 గ్రాముల బంగారు నెక్లెస్ ఉన్న బ్యాగ్‌ను మరిచిపోయారు. ఆటో డ్రైవర్ నరసింహ రాజా బ్యాగ్‌ను గుర్తించి కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించాడు. సీఐ చిన్న పెద్దయ్య బాధితులను గుర్తించి నెక్లెస్‌ను వారికి అందజేశారు.