స్వామివారి పుష్కరిణిలో బాలుడి మృతదేహం లభ్యం
BHNG :శ్రీలక్ష్మీనరసింహస్వామి వారికి సంబంధించిన కొండ క్రింద గల శ్రీలక్ష్మి పుష్కరిణిలో బుధవారం ఉదయం ఒక బాలుడి మృతదేహం లభ్యమైంది. వెంటనే దేవస్థానం శానిటేషన్ సిబ్బంది ఆ బాలుడి దేహాన్ని బయటకు తీసి చూడగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు గుర్తించారు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.