అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

NRPT: మక్తల్ మండలం సంగంబండలో ఏపీకి చెందిన వలస కూలీ పెద్ద వెంకట్రావు(40) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సోమవారం అడవిలో అపస్మారక స్థితిలో ఉన్న అతడిని తండ్రి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. వడదెబ్బ అని భావించినా, తల వెనుక గాయం, రక్తస్రావం ఉండటంతో హత్య జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.