పాతనేరస్థులను బైండోవర్ చేయాలి: సీపీ
NZB: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో పాత నేరస్థులను బైండోవర్ చేయాలని సీపీ సాయిచైతన్య సూచించారు. జక్రాన్పల్లి పోలీస్ స్టేషన్ను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా ప్రతి పోలింగ్ స్టేషన్ను పోలీసు సిబ్బంది తనిఖీ చేసి సౌకర్యాలు ఉన్నాయా లేదా చూడాలన్నారు.