నగరంలో మరో అగ్ని ప్రమాదం
HYD: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్-3లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ రెస్టారెంట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.