పరీక్షా కేంద్రంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ
NLG: కట్టంగూర్‌లోని సాందీపని పాఠశాలలో పదో తరగతి పరీక్ష కేంద్రంలో టెన్త్ విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆఫ్ కట్టంగూర్ కింగ్స్ ఆధ్వర్యంలో పున్నంరాజు సుధాకర్- సౌమ్య దంపతుల సహకారంతో 250 మజ్జిగ ప్యాకెట్లను మంగళవారం విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు చిక్కు శేఖర్ మాట్లాడుతూ.. వేసవిలో విద్యార్థులు ఆరోగ్య పరిరక్షణకు జాగ్రత్త వహించాలన్నారు.