శ్రీశైలంలో రైతుల ఆందోళన వాయిదా
NDL: శ్రీశైలంలో ఇవాళ తెలంగాణ రైతులు చేపట్టాల్సిన ఆందోళన వాయిదా పడింది. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏపీ జెన్కో అధికారులు స్పందించి విద్యుత్ ఉత్పత్తిని తాత్కాలికంగా ఆపడంతో ఆందోళనను వాయిదా వేస్తున్నట్లు రైతు నాయకులు తెలిపారు.