పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్, ఎస్పీ

BPT: చీరాలలోని యార్లగడ్డ అన్నపూర్ణాంబ ప్రభుత్వ మహిళా కళాశాలలో ఆదివారం నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ వెంకట మురళి, ఎస్పీ తుషార్ డూడి పరిశీలించారు. పరీక్షలు సజావుగా జరుగుతున్నాయా లేదా అని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎస్పీ పరీక్షా కేంద్రంలోని ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.