తాగి వాహనాలు నడిపితే జైలుకే

BPT: చీరాలలో టూ టౌన్ ఎస్సై వెంకటేశ్వర్లు సోమవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లు నిర్వహించారు. పలువురు ద్విచక్ర వాహనదారులకు డ్రంక్ డ్రైవ్ టెస్ట్‌లు నిర్వహించి కౌన్సిలింగ్ ఇచ్చారు. తాగి వాహనాలను నడపవద్దని ఆయన సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. తాగి వాహనాలు నడిపితే జైలుకేనని ఎస్సై వెంకటేశ్వర్లు హెచ్చరించారు.