జిల్లాలో కమ్మేసిన పొగ మంచు
SRPT: సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో జాతీయ రహదారి 65 పై దట్టమైన పొగ మంచు కమ్ముకుంది. తీవ్రమైన చలితో పాటు పొగ మంచు కారణంగా రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున వాహనదారులు మరింత జాగ్రత్త పాటించాలని జిల్లా అధికారులు సూచిస్తున్నారు.