రైల్వేశాఖ కీమెన్ల విధులకు జీపీఎస్ నిఘా

రైల్వేశాఖ కీమెన్ల విధులకు జీపీఎస్ నిఘా

ATP: గుంతకల్లు రైల్వే డివిజన్‌లో ప్రయాణికుల భద్రత కోసం అధికారులు పర్యవేక్షణను పటిష్టం చేశారు. 250 మంది కీమెన్లకు జీపీఎస్ పరికరాలను అందజేశారు. పట్టాల వెల్డింగులు, ఫిష్‌ప్లేట్ల `లోపాలను గుర్తించే వీరు విధులకు డుమ్మా కొట్టకుండా శాటిలైట్ ద్వారా నిఘా ఉంచారు. డీఆర్‌ఎం చంద్రశేఖర్ గుప్తా చేపట్టిన ఈ విధానం ప్రమాదాల నివారణకు సత్ఫలితాలను ఇస్తోంది.