రాష్ట్రంలో మరో స్క్రబ్ టైఫస్ మరణం!

రాష్ట్రంలో మరో స్క్రబ్ టైఫస్ మరణం!

AP: గుంటూరులోని జీజీహెచ్‌లో మరో స్క్రబ్ టైఫస్ మరణం వెలుగు చూసింది. ప్రకాశం జిల్లా ఎర్రగొండకు చెందిన ధనమ్మ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. అయితే, స్క్రబ్ టైఫస్‌గా అనుమానించిన వైద్యులు ఆమెను జీజీహెచ్‌కు తరలించారు. తీవ్ర జ్వరం, ఇతర అనారోగ్య లక్షణాలతో ఆమె చికిత్స పొందుతూ మరణించినట్లు సమాచారం. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.