మహిళా హక్కుల రక్షణకై న్యాయ వ్యవస్థ నిరంతరం కృషి
NLG: మహిళల హక్కులు, వారి రక్షణ కోసం న్యాయ వ్యవస్థ నిరంతరం కృషి చేస్తుందని నల్లగొండ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం. నాగరాజు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం నల్లగొండలోని న్యాయ సేవా సదన్‌లో నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.