రాజీవ్ రహదారిపై వ్యాన్ బోల్తా.. ఇద్దరికి గాయాలు
SDPT: కోహెడ మండలం శంకర్ నగర్ స్టేజీ సమీపంలోని రాజీవ్ రహదారిపై కరీంనగర్ నుంచి నిత్యావసర సరుకులు తీసుకెళ్తున్న వ్యాన్ ప్రమాదానికి గురైంది. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా వ్యాన్ ముందు టైర్ పగిలింది. దీంతో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను కరీంనగర్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.