ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

GDWL: జిల్లా కలెక్టరేట్ సముదాయంలోని ఈవీఎం గోడౌన్‌ను బుధవారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా పరిశీలించారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జరిగిన ఈ నెలవారీ తనిఖీల్లో భాగంగా ఆయన ఈవీఎంలు, బ్యాలెట్ యంత్రాల భద్రతను సమీక్షించారు. యంత్రాల నిర్వహణలో నిబంధనలు పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ తనిఖీ రిజిస్టర్‌ను చూశారు.