నగరంలో వ్యభిచారం గుట్టు రట్టు
ASR: VIP రోడ్డు స్పా సెంటర్లో వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందగా, ఇవాళ PS CI పైడయ్య సిబ్బందితో కలిసి దాడి నిర్వహించారు. ఈ దాడిలో స్పా సెంటర్ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించారు. గదిలో ఓ విటుడు మహిళతో ఉండగా, మరో 9 మంది మహిళలు పక్క గదిలో ఉన్నట్లు తేలింది. వారిని విచారించగా డబ్బు కోసం లైంగిక దోపిడీకి గురిచేస్తున్నట్లు తెలిపారు.