అగ్నిమాపక వారోత్సవాల గోడపత్రికల ఆవిష్కరణ
CTR: పుంగనూరులోని భగత్ సింగ్ కాలనీలో గల అగ్నిమాపక కేంద్రంలో అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 1944లో ముంబై ఓడరేవులో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బందికి నివాళులర్పించడంతో ఈ కార్యక్రమం మొదలైంది. ఈ సందర్భంగా కరపత్రాలు, గోడపత్రికలను ఆవిష్కరించారు. అనంతరం, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు.