VIDEO: శ్రీ సీతారామచంద్ర స్వామి హుండీ లెక్కింపు

BDK: భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో బుధవారం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తుల సమక్షంలో పారదర్శకంగా లెక్కింపు చేపట్టారు. ఈ సందర్భంగా స్వామివారి హుండీలో భక్తులు సమర్పించిన నగదు, బంగారం, వెండి ఆభరణాలు, విదేశీ కరెన్సీలు లెక్కించారు. అధికారులు హుండీ లెక్కింపు వివరాలను ప్రకటిస్తామన్నారు.