పంజా విసురుతున్న చలి పులి.. పడిపోతున్న ఉష్ణోగ్రతలు
MDK: జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతుంది. రానున్న రోజుల్లో కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు రెండు, మూడు డిగ్రీల సెల్సియస్‌కు తగ్గిపోయే అవకాశం ఉందని HYD వాతవరణ శాఖ పేర్కొంది. దీనికి అనుగుణంగా మెదక్ జిల్లాలో చలి గాలులు వీస్తాయని, ఎల్లో అలెర్ట్‌ను సైతం జారీ చేసింది. చలి పులి పంజా విసురుతున్న నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.