అన్న క్యాంటీన్‌లో కలెక్టర్ తనిఖీ

అన్న క్యాంటీన్‌లో కలెక్టర్ తనిఖీ

అనంతపురం నగరం గుత్తి రోడ్డులోని అన్న క్యాంటీన్‌ను జిల్లా కలెక్టర్ ఆనంద్ శనివారం తనిఖీ చేశారు. భోజనం నాణ్యత, సమయపాలనపై ప్రజలతో నేరుగా మాట్లాడి వివరాలు ఆరా తీశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సరైన మొబైల్ నంబర్లు నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ప్రభుత్వానికి ఫీడ్‌బ్యాక్ అందేలా అవగాహన బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.