'పోలీస్ సేవలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యం'

'పోలీస్ సేవలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యం'

అన్నమయ్య: పోలీస్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే మా లక్ష్యం అని డీఐజీ కోయ ప్రవీణ్ అన్నారు. నేడు రాయచోటిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ధీరజ్ కునుబిల్లితో కలిసి పాస్‌పోర్ట్ ఫిర్యాదుల పరిష్కారం, వలసదారుల సౌకర్య కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. పాస్‌పోర్ట్ సమస్యల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు.