విద్యార్థినిపై అత్యాచారం.. హోరెత్తిన నిరసనలు

విద్యార్థినిపై అత్యాచారం.. హోరెత్తిన నిరసనలు

కోయంబత్తూరు కళాశాల విద్యార్థినిపై సామూహిక అత్యాచార ఘటనపై తమిళనాడులో రాజకీయ నిరసనలు హోరెత్తాయి. కోయంబత్తూరు దక్షిణ తాలూకా కార్యాలయం వద్ద టీవీకే, అన్నాడీఎంకే కార్యకర్తలు విడివిడిగా ఆందోళనలు చేశారు. అన్నాడీఎంకే కార్యకర్తలు, MLAలు నల్ల చొక్కాలు ధరించి నిరసనలో పాల్గొన్నారు. మరో వైపు రాష్ట్రంలో డీఎంకే హయాంలో మహిళలపై దారుణాలు పెరుగుతున్నాయని టీవీకే ఆరోపించింది.