విద్యుత్ షాక్‌తో రైతు మృతి

విద్యుత్ షాక్‌తో రైతు మృతి

అన్నమయ్య: చిట్వేలి మండలం పత్తిగుంటపల్లిలో శనివారం రైతు రాఘవ నరసరాజు (59) తన పొలంలోని నిమ్మ తోటకు నీరు పెట్టేందుకు వెళ్లి విద్యుత్ షాక్‌తో మరణించారు. పొలంలో తెగిపడి ఉన్న విద్యుత్ వైరును గమనించకుండా దానిపై కాలు వేయడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే కుప్పకూలారు. స్థానికులు ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.