విద్యుత్ షాక్‌కు గురై రైతు మృతి

KDP: మైదుకూరులోని పోరుమామిళ్ల రోడ్డులో ఎర్ర చెరువు సమీపంలో సోమవారం రాటాల పవన్ కుమార్ (38) అనే కౌలు రైతు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. వ్యవసాయం మోటార్ వేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషయమై పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. రైతు మృతితో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.