VIDEO: కాళోజీ అడుగుజాడల్లో నడవాలి: సీతయ్య
SRPT: ప్రజాకవి కాళోజీ నారాయణరావు అడుగుజాడల్లో నడిచి ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సీతయ్య అన్నారు. గురువారం తుంగతుర్తిలోని బీఆర్ఎస్ కార్యాలయంలో కాళోజీ వర్ధంతిని నిర్వహించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. తెలంగాణ భాష, సాహిత్యానికి కాళోజీ చేసిన సేవలు మరవలేనివని కొనియాడారు.