యుద్ధం ఆగాలంటే షరతులు తప్పనిసరి: ఇరాన్
యుద్ధానికి ముగింపు పలకాలంటే తమ షరతులు అంగీకరించాల్సిందేనని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ స్పష్టం చేశారు. భవిష్యత్‌లో తమ దేశంపై ఎవరూ దాడులు చేయకుండా అంతర్జాతీయ గ్యారెంటీ ఇవ్వాలని, దాడుల వల్ల జరిగిన భారీ నష్టానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. జియోనిస్ట్ పాలకులు విధ్వంసం సృష్టిస్తున్నారని, ఇరాన్ న్యాయమైన హక్కులను ప్రపంచం గుర్తించాలని ఆయన సంచలన ప్రకటన చేశారు.